Saturday, October 1, 2016

SrI bhramarAmbAshTakam శ్రీ భ్రమరాంబాష్టకం

SrI bhramarAmbAshTakam

1.ravi sudhAkara vahni lOchani ratna kunDala bhUshiNI |
pravimalammuga mammunElina bhakta jana chintAmaNI ||
avani janulaku kongu bangAraina daiva SikhAmaNI |
Sivuni paTTapurANi guNamaNi SrIgirI bhramarAmbikA ||


2. akshayambuga kASilOpala annapUrNa bhavAnivai  |
sAkshi gaNapati gannatallivi sadguNAvati SAmbhavI ||
mOkshamosageDu kanakadurgavu mUlakAraNa Saktivai |
Siksha jEtuvu kRura janulanu SrIgirI bhramarAmbikA ||

3. kaliyugambuna mAnavulakunu kalpataruvaiyunDavE |
velayu SrIgiri Sikharamanduna vibhavamuga vilasillavE ||
ilanu sadbhaktavarulaku nishTa sampadalIyavE | 
jilugu kunkuma kAntirEkhala SrIgirI bhramarAmbikA || 

4. anga vanga kaLinga kASmIrAndhra dESamulandunan |
ponguchunu karahATa konkaNa puNya bhUmulayandunan ||
rangugA karNATa marATa seemalayandunan |
SRngiNI dESamula velasina SrIgirI bhramarAmbikA ||

5. vellivirisenu nI prabhAvamu vishNulOkamu nandunan |
pallavinchenu needu bhAvamu brahmalOkamu nandunan ||
mOllamuga kailAsamanduna mUDu lOkamulandunan |
chellunammA lOkapAvani SrIgirI bhramarAmbikA ||

6. bhUtanAthuni vAmabhAgamu pondugA chEkonTivE |
khyAtiganu SrISailamuna vikhyAtigA nelakonTivE ||
pAtakambulu pAradrOluchu bhaktulanu chEkonTivE |
SvEtagiripai velasiyunDina SrIgirI bhramarAmbikA ||

7. sOmaSEkhari pallavAdhari sundarImaNi dhImaNI|
kOmalAngi kRpApayOnidhi kuTilakuntala yOginI ||
nA manambuna pAyakunDeDu nagakulESuni nandinI |
sIma lOpala vinutikekkina SrIgirI bhramarAmbikA ||

8. taruNi SrIgiri mallikArjuna daivatESuni bhAminI |
karuNatO mammElukunTivi kalpavRkshamu rItinin ||
varusatO nI ashTakambunu vrAsi chadivina vArikin |
sirulanIyave ellakAlamu SrIgirI bhramarAmbikA ||


శ్రీ భ్రమరాంబాష్టకం

1.రవి సుధాకర వహ్ని లోచని రత్న కుండల భూషిణీ |
ప్రవిమలమ్ముగ మమ్మునేలిన భక్త జన చింతామణీ ||
అవని జనులకు కొంగు బంగారైన దైవ శిఖామణీ |
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరీ భ్రమరాంబికా ||

2. అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై  |
సాక్షి గణపతి గన్నతల్లివి సద్గుణావతి శాంభవీ ||
మోక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివై |
శిక్ష జేతువు కౄర జనులను శ్రీగిరీ భ్రమరాంబికా ||

3. కలియుగంబున మానవులకును కల్పతరువైయుండవే |
వెలయు శ్రీగిరి శిఖరమందున విభవముగ విలసిల్లవే ||
ఇలను సద్భక్తవరులకు నిష్ట సంపదలీయవే
జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరీ భ్రమరాంబికా || 

4. అంగ వంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్ |
పొంగుచును కరహాట కొంకణ పుణ్య భూములయందునన్ ||
రంగుగా కర్ణాట మరాట సీమలయందునన్ |
శృంగిణీ దేశముల వెలసిన శ్రీగిరీ భ్రమరాంబికా ||

5. వెల్లివిరిసెను నీ ప్రభావము విష్ణులోకము నందునన్ |
పల్లవించెను నీదు భావము బ్రహ్మలోకము నందునన్ ||
మోల్లముగ కైలాసమందున మూడు లోకములందునన్ |
చెల్లునమ్మా లోకపావని శ్రీగిరీ భ్రమరాంబికా ||

6. భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివే |
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివే ||
పాతకంబులు పారద్రోలుచు భక్తులను చేకొంటివే |
శ్వేతగిరిపై వెలసియుండిన శ్రీగిరీ భ్రమరాంబికా ||

7. సోమశేఖరి పల్లవాధరి సుందరీమణి ధీమణీ|
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ ||
నా మనంబున పాయకుండెడు నగకులేశుని నందినీ |
సీమ లోపల వినుతికెక్కిన శ్రీగిరీ భ్రమరాంబికా ||

8. తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవతేశుని భామినీ |
కరుణతో మమ్మేలుకుంటివి కల్పవృక్షము రీతినిన్ ||
వరుసతో నీ అష్టకంబును వ్రాసి చదివిన వారికిన్ |
సిరులనీయవె ఎల్లకాలము శ్రీగిరీ భ్రమరాంబికా ||

No comments:

Post a Comment